నేటి నుండి ప్రజల కొరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

– సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడి 
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రజానీకానికి మంగళవారం 02-04-2024 నుండి నిజామాబాద్  సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు,  లక్ష రూపాయలకు పైనా నష్టపోయిన వ్యక్తి నుండి పిర్యాదు తీసుకొని సైబర్ నేరానికి సంబందించిన కేసులో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరిగింది. కావున ఎవరైనా పిర్యాదు చేయదలచిన వారు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్,  పోలీస్ కమిషనర్ ఆఫీసు ( వెనక భాగంలో ) లో ఫిర్యాదు ఇవ్వగలరు. లక్ష రూపాయలకు దిగువన గల సైబర్ క్రైమ్ కేసులు, సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదు చేయగలరు. సైబర్ క్రైమ్ నకు గురైన వెంటనే 1930 కి కాల్ చేయాలి (లేదా) www.cybercrime.gov.in పోర్టల్ లో పిర్యాదు నమోదు చేయాలి.ఇందులో భాగంగా నేడు మొదటి ఫిర్యాదు రావడం జరిగింది. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు పోలీస్ స్టేషన్  08462-227433 డి.ఎస్.పి : 8712665554 సీఐ : 8712665587 అనీ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి తెలియజేశారు కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి ఇబ్బందులకు గురికా కూడారని తెలియజేశారు.
Spread the love