బ్యాటరీ ఎలక్ట్రిక్‌ రంగంలోకి డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్

నవతెలంగాణ-హైదరాబాద్ : డైమ్లెర్ ట్రక్ ఎజి (“డైమ్లర్ ట్రక్”) యొక్క సంపూర్ణ-యాజమాన్య అనుబంధ సంస్థ అయిన డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ (డిఐసివి) ఆల్-ఎలక్ట్రిక్, నెక్స్ట్-జనరేషన్ ‘ఇ-క్యాంటర్’ తో భారతీయ బ్యాటరీ ఎలక్ట్రిక్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. భారతదేశంలో ఆల్-ఎలక్ట్రిక్ ఇ-క్యాంటర్ యొక్క ప్రవేశం దీర్ఘకాలంలో డిఐసివి యొక్క పోర్ట్‌ఫోలియోను డీకార్బనైజ్ చేయడానికి మొదటి అడుగుగా నిలుస్తుంది. భారతదేశం యొక్క లైట్-డ్యూటీ ట్రక్ విభాగంలోకి డిఐసివి  యొక్క ప్రవేశాన్ని సూచించే ఆల్-ఎలక్ట్రిక్ ‘ఇ-క్యాంటర్’, రాబోయే 6 నుండి 12 నెలల్లో మార్కెట్‌లో ప్రారంభించబడుతుంది.
ప్రపంచ దృష్టికోణంలో, డైమ్లర్ ట్రక్ ప్యారిస్ వాతావరణ సంరక్షణ ఒప్పందానికి పూర్తిగా కట్టుబడి ఉంది. ఆధునిక రవాణా కి మార్గదర్శశి అయిన డైమ్లర్ ట్రక్ CO2-న్యూట్రల్ రవాణాను ప్రపంచవ్యాప్తంగా విజయవంతం చేయాలని మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి దోహదపడాలని నిర్ణయించుకుంది. రవాణా పరిశ్రమను డీకార్బనైజ్ చేయడం మరియు వనరుల వినియోగాన్ని తగ్గించడం వంటి స్పష్టమైన దృష్టితో, డైమ్లర్ ట్రక్ తన కొత్త ట్రక్కులు మరియు బస్సులను 2050 నాటికి యూరప్, జపాన్ మరియు యు.ఎస్.ఎ. లలో CO2-న్యూట్రల్ గా మార్చడానికి ప్రయత్నిస్తోంది. డైమ్లర్ ట్రక్ యొక్క గ్లోబల్ డీకార్బనైజేషన్ విజన్ మరియు పైన పేర్కొన్న కోర్ మార్కెట్లను అనుసరించి వీలైనంత త్వరగా భారతదేశం కోసం సంపూర్ణ లక్ష్యానికి అనుగుణంగా CO2-న్యూట్రల్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో యొక్క సంసిద్ధతపై డిఐసివి పని చేస్తోంది.
డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ శ్రీ సత్యకాం ఆర్య మాట్లాడుతూ, “దీర్ఘకాలికంగా CO2-న్యూట్రల్ ప్రొపల్షన్ టెక్నాలజీలను కలిగి ఉండే మా భవిష్యత్ ఉత్పత్తుల కోసం దృఢమైన సంసిద్ధతను సాధించేందుకు మా ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. రాబోయే 6 నుండి 12 నెలల్లో భారతదేశంలో ఆల్-ఎలక్ట్రిక్ ‘ఇ-క్యాంటర్’ యొక్క ప్రారంభం మా పూర్తి ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను డీకార్బనైజ్ చేయడానికి మా దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా మొదటి అడుగు. అయితే, డీజిల్ ఐసిఇ మరియు CO2-న్యూట్రల్ ప్రొపల్షన్ టెక్నాలజీలు భారత మార్కెట్‌లో రాబోయే కాలంలో సహా ఉనికిలో కొనసాగుతాయి. మా ఈ దీర్ఘకాలిక ప్రణాళిక అనేక సంక్లిష్టమైన బాహ్య కారకాలపై ఆధారపడి ఉంటుంది, వాటిలో కొన్ని, ఛార్జింగ్ మరియు రీఫ్యూయలింగ్ యొక్క మౌలిక సదుపాయాల లభ్యత, గ్రీన్ ఎనర్జీ లభ్యత, ఖర్చు సమానత్వం మరియు విస్తృత స్థాయి కస్టమర్ ఆమోదం. అందువల్ల, ఇ-క్యాంటర్తో కస్టమర్ అంగీకారంతో పాటు ఉత్పత్తి మరియు సేవా శ్రేష్ఠతను సాధించడమే మా ప్రారంభ లక్ష్యంగా పెట్టుకున్నాము . రాబోయే రెండు దశాబ్దాలలో మేము డీకార్బనైజ్డ్ రవాణా పరిష్కారాలతో దృఢమైన స్థావరాన్ని కలిగి ఉంటాము మరియు భారతదేశంలో స్థిరమైన రవాణాలో అగ్రగామిగా ఎదగడానికి పురోగతిని సాధిస్తాము,” అని అన్నారు.
డిఐసివి భారతీయ మార్కెట్ రాబోయే సంవత్సరాలలో ఎలా రూపుదిద్దుకుంటుందనే దానిపై నిశిత దృష్టిని సారిస్తోంది. డిఐసివి యొక్క CO2-న్యూట్రల్ ప్రొపల్షన్ టెక్నాలజీ రోడ్‌మ్యాప్ బ్యాటరీ ఎలక్ట్రిక్ మరియు హైడ్రోజన్ ఆధారిత డ్రైవ్ టెక్నాలజీలతో కూడిన డైమ్లర్ ట్రక్ యొక్క గ్లోబల్ టెక్నాలజీ స్ట్రాటజీకి అనుగుణంగా తయారు చేయబడుతోంది. డిఐసివి ఇప్పటికే భారత్‌బెంజ్ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ కాన్సెప్ట్ కోచ్‌ను ఒక పెద్ద భారతీయ కాంగ్లోమెరేట్ తో కలిసి అనుబంధంగా అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో, డిఐసివి   వివిధ యుటిలిటీ విభాగాలలో ట్రక్కులను పరిచయం చేస్తుంది, ఇవి సుదూర, మైనింగ్, నిర్మాణం, పిఓఎల్, డంపర్, ఆర్.ఎం.సి. మరియు వివిధ సరుకు రవాణా మరియు భూభాగ అవసరాల కోసం సేవలను అందిస్తాయి.
“ఎల్ఎన్‌జి, ఒక వేళ ఉపయోగించినట్లయితే, సుదూర రవాణా కోసం తాత్కాలిక, వ్యూహాత్మక పరిష్కారం అవుతుంది. మేము ప్రాథమికంగా మా భవిష్యత్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో దశలవారీగా బ్యాటరీ-ఎలక్ట్రిక్ మరియు హైడ్రోజన్-ఆధారిత ప్రొపల్షన్ టెక్నాలజీలకు కట్టుబడి ఉంటాము. మార్కెట్ ఉన్నప్పుడే సరైన వాహనాలతో సిద్ధంగా ఉంటాం,’’ అని శ్రీ ఆర్య అన్నారు.
భారతదేశం కోసం ఆల్-ఎలక్ట్రిక్ ‘ఇ-క్యాంటర్’ ప్రస్తుతం అడ్వాన్స్డ్ ట్రయల్స్‌లో ఉంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్ జపాన్‌లో ఉద్భవించింది మరియు మొదటి-తరం ‘ఇ-క్యాంటర్’ యొక్క ఉత్పత్తి 2017లో ప్రారంభమైంది. సరికొత్త, తదుపరి తరం ఇ-క్యాంటర్ 2022 రెండవ భాగంలో జపాన్ మరియు యూరప్‌లో ప్రదర్శించబడింది. 2017లో మొదటి-తరం ఇ-క్యాంటర్ ని ప్రారంభించినప్పటి నుండి యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు హాంకాంగ్‌లలో వందల సంఖ్యలో విక్రయించబడింది. నిరూపితమైన ‘ఇ-క్యాంటర్’ యొక్క తదుపరి తరం 100 వేరియంట్‌లతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్‌లలో అందుబాటులో ఉండనుంది.
భారతదేశం యొక్క నిరూపితమైన ప్రొపల్షన్ టెక్నాలజీ మార్కెట్ ఇంకా శైశవదశలో ఉంది కాబట్టి దీర్ఘకాలంలో విపరీతమైన పరిధిని కలిగి ఉంది. భారతదేశం కూడా ఆర్ & డి కి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్థావరం మరియు కొత్త టెక్నాలజీలు ఉద్బవిస్తున్న కొద్దీ  భవిష్యత్తులో ఉత్పత్తి అభివృద్ధికి కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. ఏది ఏమైనప్పటికీ, ప్రపంచంతో పోటీ పడాలంటే భారతదేశానికి అనుకూలమైన, దృఢమైన విధానాలు మరియు మార్కెట్ వాతావరణం అవసరం.
కస్టమర్‌లకు ఆర్థిక సాధ్యతను నిర్ధారించడానికి అనుకూలమైన పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఎలా కీలకం అని వ్యాఖ్యానిస్తూ, శ్రీ ఆర్య ఇలా జోడించారు, “టోటల్ కాస్ట్ అఫ్ ఓనెర్షిప్ (TCO) కి   సంబంధించిన మొత్తం ఖర్చుల సమీకరణాల్లో మార్పుల గురించి విస్తృత వినియోగదారు ఆమోదం ఉన్నట్లయితే CO2-న్యూట్రల్ వాహనాల యొక్క స్వీకరానా విజయవంతంగా  సాధ్యమవుతుంది. స్థిరమైన చలనశీలత పరిష్కారాలలో విజయాన్ని సాధించడంలో ముఖ్యమైన కారకాల ప్రభావాన్ని ఇది నొక్కి చెబుతుంది. CO2-న్యూట్రల్ ప్రొపల్షన్ టెక్నాలజీలలోకి ప్రవేశించడం ద్వారా, డిఐసివి  భారతదేశం యొక్క భవిష్యత్తుకు తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకుంది.”

Spread the love