ఖైదీలకు స్మార్ట్ కార్డులు

నవతెలంగాణ – ముంబయి: జైల్లో ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు స్మార్ట్‌ కార్డులను జారీ చేసింది. ఛత్రపతి శంభాంజీనగర్‌లోని సెంట్రల్‌ జైలులో దాదాపు 650 మంది ఖైదీలకు వారి కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను పంపిణీ చేసినట్లు ఓ జైలు అధికారి తెలిపారు. వీటి ద్వారా ఖైదీలు వారానికి మూడుసార్లు, ఆరు నిమిషాల పాటు తమ వారికి ఫోన్‌ చేసి మాట్లాడుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

 

Spread the love