నవతెలంగాణ – ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కందివలి ప్రాంతంలోని పవన్ ధామ్ వీణ సంతూర్ భవనం ఫస్ట్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా మృతులను గ్లోరీ వాల్పతి (43), జోసు జెమ్స్ రాబర్ట్ (8)గా గుర్తించారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి సమాచారం అందగా 8 అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి కారణాలేంటన్న వివరాలు ఇంకా వెలుగుచూడలేదు. ప్రాధమిక విచారణ అనంతరం వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.