నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆదివారం తెల్లవారుజామున బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతమంతా పొగలు దట్టంగా అలుముకున్నాయి. చుట్టుప్రక్కల నివసించే వారు ప్రాణ భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పాలికా బజార్‌లో ధమాకా సేల్ రెడీమేడ్ బట్టల షాప్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. షాట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకుని.. దట్టమైన పొగలు అలుముకొన్నాయి. ఆ చుట్టుపక్కల పలు షాపులతోపాటు లాడ్జీలు కూడా ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.