దళితులకు 300 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వాలి

దళితులకు 300 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వాలి– కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు ఇసునం మహేందర్
నవ తెలంగాణ – కాటారం
దళితులకు 300 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వాలని కరెంటు ఏ ఈ మేఘనాథ్ కు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు ఇసునం మహేందర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్, కేరళ, ఢిల్లీ, తమిళనాడులో దళితులకు 300 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో కూడా దళితులకు 300 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 342 ప్రకారం 101 ఉచిత కరెంటు ప్రభుత్వం ఇస్తుందని కానీ దళితులకు 101 కరెంట్ గురించి పూర్తి సమాచారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ఉచిత కరెంటు గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి దళితులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దళిత కుటుంబాల మీద కరెంటు అధికారుల వేధింపులు ఉండకుండా చూడాలని , బిల్లుల విషయంలో వారి కరెంట్ కనెక్షన్ కట్ చేయకుండా వారి కరెంటు సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించాలని అన్నారు…

Spread the love