దళిత బందుకు నీదులు మంజూరు చేయాలి..

– కలెక్టర్ కార్యాలయం ఆందోళన
నవతెలంగాణ – మల్హర్ రావు
గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన దళితబందు పథకానికి నిధులు మంజూరు చేసి లబ్ధిదారులకు దళితబందు అందించాలని శుక్రవారం దళిత బందు సాధన సమితి ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి,కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు దళిత బంధు సాధన సమితి ఆద్వర్యంలో దళిత బంధు లబ్దిదారులను ఏంపిక చేయటం జరిగిందని, తరువాత ఏన్నికల కోడ్ రావడంతో నిలిసిపోయిందన్నారు. దళిత బంధు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రధాన ప్రతి పక్షమైన బిఆర్ఏస్ నాయకులు కేటిఆర్, హరీష్ రావు తోపాటు మిగతా ప్రతి పక్షలాను సైతం కూడ కలవడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు నౌల్ల సంపత్,గౌరవ అధ్యక్షుడు భూపల్లి రాజు,ప్రధాన కార్యదర్శి భూతం మదుకర్, ఉపాధ్యక్షులు మెడిగడ్డ దుర్గారావు, పులి రామన్న, కోశాధికారి మందపల్లి మమత, సలహదారులు  బొబ్బిలి వెంకన్న, దశారపు శ్వామి, నార రమేష్,మంథన సమ్మయ్య, కన్వీనర్ వేమునురి జక్కన్న, కొకన్వీనర్ పంథకాని లక్ష్మయ్య, ప్రచార కార్యదర్శి జాడి రాజబాబు,సహాయ కార్యదర్శి వేములవాడ రాజబాబు, సోషల్ మీడియా ఇంచార్జి మంత్రి రాజబాబు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Spread the love