ఆర్థిక నేరగాళ్ల ను తరిమికొట్టాలి:దాసారపు శ్రీనివాస్

నవతెలంగాణ- రామకృష్ణాపూర్
చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న ఆర్థిక నెరగాళ్లను తరిమికొట్టాలి చెన్నూరు నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి దాసారపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.గురువారం పట్టణంలోని స్థానిక గద్దరాగడి లోని వారి స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గతంలో చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామి కుటుంబం పోటీ చేసి గెలిచి ఇప్పుడు వేరే నియోజకవర్గం నుంచి వినోద్ పోటీ చేయడానికి దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇక్కడ అభివృద్ధి చేయకనే వేరే నియోజకవర్గానికి వలస వెళ్లారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయనని బహిరంగంగానే ప్రకటించిన వివేక్ వెంకటస్వామి ఎందుకు మళ్ళీ చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు.మీ కంపెనీలకు సంబంధించిన డబ్బు ఎక్కడిది దానికి సంబంధించిన వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.రహస్య వీడియో కాల్స్ మాట్లాడడం ద్వారా వివేక్ సుమన్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లు స్పష్టం అవుతుందని, గతంలో బిఆర్ఎస్ లో పనిచేసిన బంధం రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తారనేది స్పష్టమైందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు చైతన్యంగా ఉన్నారని ఇతర రాష్ట్రాలలో కంపెనీలు పెట్టి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇక్కడ 40 వేలు ఉద్యోగాలు కల్పిస్తామనడం ప్రజలు నమ్మాలా? ఇద్దరు నాటకాలు ఆపాలని, .తరిమి కొడతాం మా పాలన మేము చేసుకుంటాంమని ధ్వజమెత్తారు. ఉస్మానియా ఉద్యమ విద్యార్థి సుమన్ గెలిచి ఏం చేశారు? ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు?అని ప్రశ్నించారు. బహుజనులకు రాజ్యాధికారం కోసం కృషి చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ బహుజనులకు రాజ్యాధికారం విద్య, వైద్యం, ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా మేనిఫెస్టో తయారు చేశారని అన్నారు. చెన్నూరు నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం, ఇక్కడే ఇలాంటి పరిస్థితి ఉండడం దురదృష్టకరమం, 2014లో తెలంగాణలో కొత్త బావులు, ఉద్యోగాలు ఇస్తామని, సింగరేణి ప్రాంతాన్ని ఎడారి చేశారని మండిపడ్డారు. చెన్నూరు ప్రజలు గమనించాలని, బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేస్తామని, విద్య వైద్యం ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న బిఎస్పి పార్టీ ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా అధ్యక్షులు గుణ,మహిళా నాయకురాలు పాల్గొన్నారు.
Spread the love