చైతన్యపురి స్టేషన్‌ను సందర్శించిన డీసీపీ

నవతెలంగాణ – చైతన్యపురి
ఎల్బీనగర్‌ నూతన డీసీపీ సిహెచ్‌. ప్రవీణ్‌ కుమార్‌ శనివారం చైతన్య పురి పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్‌ సిబ్బందితో మాట్లాడారు. తర్వాత వారికి తగు సూచనలు చేశారు. స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న నేరాల గురించి ఆరా తీశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు సొంత ఊర్లకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. నేరాల నివారణకు పాట్రోలింగ్‌, రాత్రి గస్తీ పటిష్టం చేయాలని ఇన్‌స్పెక్టర్‌ నాగార్జునకు సూచించారు. అనంతరం స్టేషన్‌ అంతా కలియ తిరిగి, రికార్డులను పరిశీలించారు. డీసీపీ వెంట ఇన్‌స్పెక్టర్‌ బోయ నాగార్జున, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.

Spread the love