ఎవరు బాగుపడ్డారని దశాబ్ది ఉత్సవాలు?

-బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ద్వజం
-రైతులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆరోపణ 
-మంత్రి మంజూరీ చేసిన నిధులు దుర్వినియోగమవుతున్నాయని అసహనం
-సమస్యల వినతి కోసం మంత్రి సమయమివ్వాలని ప్రత్యేక విజ్ఞప్తి
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారని ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ద్వజమెత్తారు.రేపు మండలంలో రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు పర్యటన దృష్ట్యా మండలంలోని ప్రజలకు నెలకొన్న సమస్యలపై విన్నవించడానికి గురువారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో రత్నాకర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.మండల కేంద్రానికి అనుసందానమైన అయా గ్రామాల బీటీ రోడ్లు మరమ్మతుల్లేక గుంతలుపడి ప్రమాదకరంగా మరాయన్నారు.బేగంపేట ప్రధాన రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం జరగడం వల్ల కంకర రాళ్లతో ప్రయాణం నరకయాతనంగా మారిందని త్వరతగతిన పూర్తయ్యేల మంత్రి చోరవ చూపాలన్నారు.ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తమ ఇష్టానుసారంగ వ్యవహరిస్తూ మిల్లర్లతో కుమ్మక్కై తరుగుపేరునా కొతలు విదిస్తూ రైతన్నలను దోపిడి చేస్తున్నారని..నేటికి కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం విక్రయించిన రైతులకు నగదు జమచేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల వానకాలం పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.రైతు రుణమాఫీ హామీ పూర్తి స్థాయిలో అమలవ్వకపోవడం వల్ల రైతులు దిగాలు చెందుతున్నారని ఆర్హులైన రైతులకు ఏకకాలంలో రైతు రుణమాపీ చేయాలని కోరారు.మంత్రి హారీశ్ రావు మంజూరీ చేసిన నిధులను మళ్లించి గుత్తేదారులు మండలంలోని అయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారని..గుత్తేదారులు చేపట్టిన పనులను అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం అక్రమాలకు తావివ్వడమేనని వాపోయారు.మంత్రి మంజూరీ చేసిన నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక అధికారులతో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసిన అనంతరమే ప్రజాధనం దుర్వినియోగమవ్వకుండా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.మంత్రి శంకుస్థాపన చేసిన రేగులపల్లి, చీలాపూర్,బెజ్జంకి బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఆర్థాంతర నిలిచిపోయాయని పూర్తయ్యేల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.చీలపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి నెలమట్టమయ్యే దుస్థితి నెలకొందని..నూతన పాఠశాల,అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరీ చేయాలని విజ్జప్తి చేశారు.నాయకులు శానగొండ శ్రావణ్,రొడ్డ మల్లేశం,మైల ప్రభాకర్,డీవీ రావు,అయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
మంత్రికి కాంగ్రెస్ శ్రేణుల ప్రత్యేక విజ్ఞప్తి..
రేపు మంత్రి హారీశ్ రావు దశాబ్ది ఉత్సవాలకు హజరవుతున్న దృష్ట్యా మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి ప్రజలు ప్రయాణం సాగించే పోతారం క్రాస్ రోడ్డు మీదుగా ప్రయాణం సాగించి గత కొన్నెండ్లుగా గుంతలమయమైన రోడ్డు దుస్థితిని పర్యవేక్షణ చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ అడ్డుకాదని..అభివృద్ధి పనుల పేరునా గుత్తేదారులు పాల్పడుతున్న అవకతవకలు,నాణ్యత లోపాలను ఎత్తిచూపడమేనని.. మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలు,చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లోని అవకతవకలపై విన్నవించడానికి మంత్రి ప్రత్యేక సమయమివ్వాలని కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
Spread the love