ప్రలోభాలకు కాదు..మనసు నోచ్చుకొ బిజెపి టిఆర్‌ఎస్‌ పార్టీలను ఓడించండి

– జూలకంటి
– వామపక్ష ప్రజాతంత్ర వాదులను గెలిపించండి
మిర్యాలగూడ: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను ఓడించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సీపీఐ(రనెం) కార్యాలయంలో వేములపల్లి, మాడుగుల పల్లి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని విమర్శించారు. దేశంలో మత విద్వేషాలు సష్టించి రాజకంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ సంపదలను బడాబాబులకు అప్పచెప్పుతూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో అధికారులు ఉన్న కేసీఆర్‌ పదేళ్ల కాలంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజలపై పన్నుల రూపంలో వసూలు చేసిన ధనాన్ని సంక్షేమ పథకాల పేరిట తమ సొంత కార్యకర్తలకు అప్పజెపుతూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలవేళ అమలుకు నోచుకోని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. అహంకారం నిరంకుశత్వంతో కెసిఆర్‌ పాలన సాగిస్తున్నాడని చెప్పారు. ఇలాంటి పార్టీలను జరగబోయే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు. వామపక్ష ప్రజాతంత్ర వాదులను గెలిపించి చట్టసభలకు పంపించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు వేములపల్లి మాడుగులపల్లి మండల కార్యదర్శిలు పాదూరి శశిధర్‌ రెడ్డి, రొండి శ్రీనివాస్‌, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love