Friday, May 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుధాన్యం తరలింపులో జాప్యం.. రైతు వినూత్న నిరసన

ధాన్యం తరలింపులో జాప్యం.. రైతు వినూత్న నిరసన

- Advertisement -

నవతెలంగాణ–ఆలేరు రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరలింపు ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు మణిపాల్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఆలేరు మార్కెట్ కమిటీ యార్డ్ వరకు తోపుడు బండితో పాదయాత్ర నిర్వహించారు.మండుతున్న ఎండలో ధాన్యం సంచులు తోపుడు బండిపై ఉంచుకుని,కాళ్లకు చెప్పులు లేకుండా తారు రోడ్డుపై సుమారు ఏడు కిలోమీటర్ల మేర నడిచి తన నిరసనను వ్యక్తం చేశారు.ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కూడా సరైన సమయంలో తరలింపు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మణిపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండటంతో వర్షాలు వస్తే నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని, రైతుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ వినూత్న నిరసన చేపట్టినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -