- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రం ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తూ సామాజిక మాధ్యమం టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించడాన్ని సమర్థించింది. తాత్కాలిక ఆంక్షలు అవసరమేనని అభిప్రాయపడింది. నీట్ రీ ఎగ్జామ్ దృష్ట్యా టెలిగ్రామ్‌పై కేంద్రం కొన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇవి ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి.
- Advertisement -



