Friday, June 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎమ్‌‌బీబీఎస్‌ విద్యార్థుల నుంచిఅధిక ఫీజుల డిమాండ్‌

ఎమ్‌‌బీబీఎస్‌ విద్యార్థుల నుంచిఅధిక ఫీజుల డిమాండ్‌

- Advertisement -


క్లాసులకు రానివ్వని కాలేజీలపై చర్యలు తీసుకోండి
కాళోజి హెల్త్‌ యూనివర్సిటీలో పేరెంట్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు


‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఎమ్‌‌బీబీఎస్‌ ‌విద్యకు సంబంధించి నిబంధనల మేరకు నాలుగున్నరేండ్ల ఫీజు చెల్లించినప్పటికీ మరో అర సంవత్సరం ఫీజు చెల్లిస్తేనే ఇంటర్న్‌‌షిప్‌‌కు అనుమతి ఇస్తామనీ, లేకుంటే విద్యార్థులు కాలేజీలకు రావొద్దని వేధించడం దారుణమని మెడికో పేరెంట్‌ అసోసియేషన్‌ ‌రాష్ట్ర అధ్యక్ష‍ులు మల్లోజు సత్యనారాయణ చారి ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌ ‌ప్రతిమ మెడికల్‌ ‌కాలేజీ, చెల్మెడ మెడికల్‌ ‌కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తూ వేధిస్తున్నాయని గురువారం హైదరాబాద్‌‌లో కాళోజి హెల్త్‌ ‌యూనివర్సిటీ వీసీ రమేశ్‌‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ కేంద్రంలోనూ ఒక ఫిర్యాదు అందజేశారు. ఇప్పటికే మూడు సార్లు పలు కాలేజీలకు నోటీసులు జారీ చేశామనీ, మరోమారు రాతపూర్వక ఫిర్యాదులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పేరెంట్‌ అసోసియేషన్‌ ‌ప్రతినిధులు మాట్లాడుతూ.. చాలా ప్రయివేటు కాలేజీ లు విద్యార్థులను , తల్లిదండ్రులను అధిక ఫీజులకోసం ఇబ్బంది పెడుతున్నాయని వీసీ ఎదుట తమ ఆవేదనను వెళ్లగక్కారు. ప్రభుత్వం స్పందించి తల్లిదండ్రుల మీద పడే వందలకోట్ల రూపాయల భారాన్ని తొలగించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ‌ప్రతినిధులు చంద్ర శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్, రావుల మధు, యాదగిరి, మురళి రెడ్డి పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -