పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని డిమాండ్

నవతెలంగాణ – డిచ్ పల్లి
సర్టిఫికెట్ల ఫీజులను పెంచడానికి నిరసిస్తూ సెంట్రల్ లైబ్రరీ వద్ద తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ ల దిష్టిబొమ్మ ను శుక్రవారం ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ అద్వర్యంలో దగ్దం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ సెక్రెటరీ   అమృత్ చారి మాట్లాడుతూ యునివర్సిటీలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుండి వెలువరించే సర్టిఫికెట్ల ఫీజులను పెంచడానికి ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తెలంగాణ యూనివర్సిటీ, యూనివర్సిటీ పరిధిలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటారని, ఇప్పటికే స్కాలర్షిప్లు రాక మెస్ బిల్లుల రాక విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం సొంత డబ్బులు కట్టాల్సి వస్తుందని అవేదన వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో యూనివర్సిటీలో కాన్వోకేషన్ ఫీస్ ను 700 నుంచి 3500 పెంచడం బాధాకరమన్నారు. ట్రాన్స్ స్క్రిప్ట్ ల ఫీజు కూడా 100 నుండి 200 పెంచడానికి ఏబీవీపీ ఖండిస్తుందన్నారు. అలాగే మిగతా సర్టిఫికెట్లకు పెంచడానికి కూడా విద్యార్థులకు భారం మోపడమే నని, వీసీ, రిజిస్ట్రార్ లుపెంచిన ఫీజుల సర్కులర్ ని వెంటనే తగ్గించాలని, లేకపోతే తగ్గించే వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగరాజు,ఉపాధ్యక్షులు సింహాద్రి,జాయింట్ సెక్రటరీ సమీర్,అజయ్,సంతోష్, సాయి కృష్ణ,దీపక్,హరినాథ్,వినోద్, జగడం సాయి,సంతోష్,పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.
Spread the love