Tuesday, August 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడిగడ్డను కూల్చి… 
ఇప్పుడు గోదావరిపై రాజకీయాలా?

మేడిగడ్డను కూల్చి… 
ఇప్పుడు గోదావరిపై రాజకీయాలా?

- Advertisement -

గోదావరి వరదలపై తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్ నాయకులు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డను కూల్చి గోదావరిపై రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి వరదలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా రాజకీయ లబ్ది కోసం అబద్ధాలు ప్రచారం చేయడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు వాస్తవాలను వక్రీకరించడమేనని, సాగునీటి వ్యవస్థపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఖండించారు. గోదావరిలో వరద ప్రవాహం ఉందనడం, ఆ నీటినంతా వెంటనే ఎత్తిపోసే అవకాశం ఉందని చెప్పడం సరికాదని కొట్టిపారేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ అనేది రాజకీయ సభల్లో చేసే ప్రకటనలతో కాదని ఎద్దేవా చేశారు. నీటి మట్టాలు, పంపింగ్ సామర్థ్యం, కాలువలు మోయగల సామర్థ్యం, దిగువ జలాశయాల నిల్వలు, విద్యుత్ లభ్యత, ఇంజినీర్ల సాంకేతిక అనుమతులు, భద్రతా ప్రమాణాల ఆధారంగా జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ప్రజల సొమ్ముతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ నేడు ఎందుకు ఈ పరిస్థితికి చేరిందో ముందుగా బీఆర్ఎస్ నాయకులే సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో జరిగిన లోపాల వల్లే రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడిందన్న విషయం దేశమంతా చర్చించిందని, ఇప్పుడు అదే ప్రాజెక్టు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ ద్వారా నీటి తరలింపుపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయని మంత్రి అడ్లూరి తప్పుపట్టారు. ప్రాజెక్టుల రూపకల్పన ప్రకారం ఎక్కడ గ్రావిటీ సాధ్యమో అక్కడ గ్రావిటీ ద్వారా, ఎక్కడ అవసరమైతే అక్కడ ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపు జరుగుతుందని, ఇది పూర్తిగా సాంకేతిక అంశమని ఆయన స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి పేరుతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన బీఅర్ఎస్ పదేండ్ల పాలనలో ఆ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు.అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి విమర్శించడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందేలా శాస్త్రీయ విధానంలో ప్రాజెక్టుల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అడ్లూరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రచారం కోసం కాకుండా, నిపుణుల సలహాలు, సాగునీటి శాఖ ఇంజినీర్ల సాంకేతిక సూచనల మేరకు ప్రతి నిర్ణయం తీసుకుంటోందన్నారు.విమర్శలు చేసే ముందు బీఆర్ఎస్ నాయకులు పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. మేడిగడ్డ బ్యారేజీ నేడు ఈ పరిస్థితికి రావడానికి బాధ్యులు ఎవరు?, నిర్మాణ నాణ్యతపై వచ్చిన ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం ఎందుకు చెప్పడం లేదు?, ప్రాజెక్టుల భద్రత కంటే రాజకీయాలే ముఖ్యమా?, గోదావరి వరదలను కూడా రాజకీయ ప్రచారానికి వాడుకోవడం రైతుల పట్ల బాధ్యతేనా?, పదేండ్ల పాలనలో పూర్తి చేయని హామీల గురించి ప్రజలకు ఎప్పుడు వివరణ ఇస్తారు?… అంటూ ప్రశ్నలు సంధించారు. రైతులు అమాయకులు కాదని ఏది రాజకీయ ప్రచారమో వారికి తెలుసని వ్యాఖ్యా నించారు. రైతులకు ప్రెస్ మీట్లు, విమర్శలు, అబద్ధాల ప్రచారం వద్దనీ, వారికి కావాల్సింది సాగునీరు, సమ యానికి నీటి పంపిణీ, బాధ్యతా యుతమైన రాజకీ యాలని గుర్తుచేశారు. మేడిగడ్డను దెబ్బతీసిన వారే… నేడు మేడిగడ్డపై నీతులు చెప్పడం చరిత్రను మరిచి పోవడమేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పారద ర్శకంగా, శాస్త్రీయంగా సాగునీటి నిర్వహణ కొన సాగి స్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -