పురాతనమైన బురుజులు కూల్చివేత

– చుట్టుపక్కల ఇండ్ల కుటుంబాలు బురుజుల కూల్చివేతపై హర్షం
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఏనాటి కాలానికి చెందినవో కానీ ఆ పురాతనమైన బురుజులు కూలేస్థితికి ప్రమాదంకరంగా మారడం, ఈ పురాతనమైన బురుజుల పట్ల హాని జరిగి కొన్ని ప్రాణాలు పైన సంఘటనలు లేకపోలేదు ప్రమాదకరంగా మారిన పురాతనమైన బురుజులను కూల్చివేయాలంటూ మద్నూర్ గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. గ్రామ ప్రజల ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రమాదకరంగా ఉన్న పురాతనమైన బురుజులను వారం రోజుల క్రితం సందర్శించి పరిశీలించడం జరిగింది. వర్షాకాలం రాకమునుపే ప్రమాదకరంగా ఉన్న పురాతనమైన బురుజులను కూల్చివేసే కార్యక్రమం చేపట్టాలని సందర్శన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పంచాయతీ ప్రత్యేక అధికారి డాక్టర్ బండి వారి విజయ్ కి గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ లకు ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పురాతనమైన బురుజుల కూల్చివేతపై ప్రత్యేకంగా చొరవ చూపుతూ జిల్లా కలెక్టర్ అనుమతులతో శనివారం నాడు మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పురాతనమైన బురుజుల కూల్చివేత కార్యక్రమం పంచాయతీ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని పురాతనమైన బురుజుల ప్రక్కనగల ఇండ్ల కుటుంబీకులు బిక్కు బిక్కు మంటూ ఉండే వారికి ప్రత్యేక అధికారి చొరవతో బురుజుల కూల్చివేత చేపట్టడం, బురుజుల ప్రక్కన గల కుటుంబీకులు అందరూ అధికారుల చర్యలు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాత ముత్తాతల నాటి పురాతనమైన బురుజులు, ప్రమాద అంచులకు చేరాయి అలాంటి బురుజుల కూల్చివేత చేపట్టడం గ్రామస్తుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. బురుజుల కూల్చివేత పట్ల ఎలాంటి హాని జరగకుండా ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. పంచాయతీ సిబ్బంది మొత్తం బురుజుల కూల్చివేత కార్యక్రమంలోనే నిఘాపెట్టారు.
Spread the love