డిప్యూటీ సీఎం భట్టి క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – అశ్వారావుపేట: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,నందిని దంపతుల చిత్రాలతో కూడిన 2034 క్యాలెండర్ ను గురువారం కాంగ్రెస్ సీనియర్, నియోజక వర్గం నాయకులు చెన్నకేశవరావు ఆవిష్కరించారు. ఆయన స్వగృహంలో జరిగిన కార్యక్రమం అనంతరం తను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోనికి రావడానికి భట్టి విక్రమార్క దంపతుల కృషి ఎనలేనిది అని అన్నారు. అంతేకాకుండా నందిని విక్రమార్క సైతం అమ్మ ఫౌండేషన్ ద్వారా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ఎందరికో చేయూత ఇచ్చారని అన్నారు. ఇటువంటి నాయకులు ప్రజాక్షేత్రంలో ఉండడం ప్రజలకు మేలు జరుగుతుందని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం హోదా కల్పించి నందున, నందిని విక్రమార్క ను సైతం రానున్న రోజుల్లో ఉన్నత స్థానంలో ప్రజలు చూడాలని కోరుకుంటున్నారని వారు ఆశాభావం వ్యక్తం చేసారు. వారి క్యాలెండర్ ను ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కో – ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా, ఎంపీటీసీ లు వేముల భారతీ ప్రతాప్, సత్యవరుపు తిరుమల బాలగంగాధర్, పాలవలస జీవన్ రావు, ముళ్ళగిరి కృష్ణ, ఎస్కే అన్వర్, మందపాటి వెంకన్న, రమాదేవి, ఎండి రహిమత్ పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love