అశ్వారావుపేట బరిలో ఆ నలుగురు.. నాడు.. నేడు ప్రత్యర్ధులే

– గతంలోనూ నేడు ప్రత్యర్ధులు
– ఇరువురు జాతీయ పార్టీ కి చెందిన వారు
– ఇందులో ఒకరు ఎమ్మెల్యే మెచ్చా
– నాలుగో సారి పోటి పడుతున్న గోండ్వనా గణతంత్ర పార్టీ అభ్యర్ధి
– మూడో సారి పోటీ లో ఉన్న స్వతంత్రుడు
నవతెలంగాణ – అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్ర సాదారణ అసెంబ్లీ ఎన్నికలు 2023 లో అశ్వారావుపేట నియోజక వర్గం నుండి బరిలో నిలిచిన 14 మందిలో ఆ నలుగురు గతంలోనూ నేడూ ప్రత్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ నలుగురు మినహా మిగతా వారందరూ మొదటి సారి ఎన్నికల బరిలో నిలిచిన వారు కావడం గమనార్హం. అయితే ఈ నలుగురిలో ప్రస్తుతం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు 2014 పోటీ చేసి నాడు వైఎస్సార్సీపీ అభ్యర్ధి తాటి వెంకటేశ్వర్లు పై 930 ఓట్లు తో అపజయం పాలయ్యారు. 2018 లో కాంగ్రెస్ బలపరిచిన తెదేపా అభ్యర్ధిగా బరిలో నిలిచి నాడు తెరాస అభ్యర్ధి గా పోటీ పడిన అప్పటి ఎమ్మెల్యే గా ఉన్న తాటి వెంకటేశ్వర్లు ను 13,117 ఓట్లు ఆధిక్యంతో ఓడించి మెచ్చా నాగేశ్వరరావు ఎమ్మెల్యే గా విజయం సాధించారు.
2018 లో తాను  ఓడించిన కారు గుర్తు పైనే నేడు 2023 లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పోటీలో ఉండటం విశేషం. జాతీయ కాంగ్రస్ అభ్యర్ధి గా నేడు పోటి పడుతున్న జారే ఆదినారాయణ 2014 లో ఎన్నికల్లో తెరాస అభ్యర్ధిగా పోటీ పడి 13,217 ఓట్లు తో నాలుగో స్థానంలో నిలిచారు. అయితే అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో నాడు ఎమ్మెల్యే గా ఉన్న తాటి వెంకటేశ్వర్లు తెరాస లో చేరిపోవడం 2018 లో సిట్టింగ్ ల విభాగంలో తాటి వెంకటేశ్వర్లు కు సీటు రావడంతో అదే పార్టీలో ఉన్న జారే ఆదినారాయణ కు అవకాశం చేజారిపోయింది. అయినా చాలా కాలం అదే పార్టీ లో ఉన్నప్పటి కీ ఈ కాలంలోనే ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఈ సారీ ఉన్న పార్టీ లో బెర్త్ దొరికే అవకాశం లేకపోవడంతో జారే ఆదినారాయణ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేయూత తో కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. అయినా ఆదినారాయణ కంటే ముందే కాంగ్రెస్ లో చేరిన తాటి వెంకటేశ్వర్లు తో ఇక్కడా సీటు కోసం చివరి వరకు చావో రేవో పద్దతిలో పోటీ సమరం చేయాల్సి వచ్చింది. చివరికి చేయి గుర్తు పై పోటీ పడుతున్నారు. ఇకపోతే గత నాలుగు సార్లు గా  గోండ్వానా గణతంత్ర పార్టీ అభ్యర్ధిగా పోటీ పడుతున్న ములకలపల్లి కి చెందిన కన్నెబోయిన వెంకట నర్సయ్య ప్రస్తుత పోటీ దారుల్లో అత్యంత సీనియర్ ప్రత్యర్ధి. ఈయనకు 2009 లో 843,2014 లో 692,2018 లో 481 ఓట్లు సాధించాడు.ఈ ఎన్నికల్లో ఎన్ని వస్తాయో చూద్దాం. గత మూడు సార్లు గా పోటీ పడుతున్న స్వతంత్ర అభ్యర్ధి దమ్మపేట మండలం నాగుపల్లి కి చెందిన ఆంగోతు క్రిష్ణ. ఈయనకు 2018 లో 324,2018 లో 284 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా ఈ సారి బరిలో నిలిచి ప్రధాన ప్రత్యర్ధులు కంటే ఆత్మ విశ్వాసంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. సామాన్యుడి కి రాజ్యాంగం కల్పించిన ఇలాంటి అవకాశాలు మరింత పెరిగితేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.
Spread the love