రేవంత్‌రెడ్డి, భట్టి సహా పలువురి సంతాపం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్వో) మారబోయిన మధుసూదన్ (50) హఠ్మారణం చెందారు. సోమవారం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో హైదరాబాద్ అమీర్‌పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు మిర్యాలగూడలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి వంటి మీడియా సంస్థల్లో సీనియర్ జర్నలిస్టుగా కీలక బాధ్యతలను నిర్వహించారు. విధి నిర్వహణలో నికార్సైన పాత్రికేయుడిగా పనిచేశారు. మధుసూదన్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు బి మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, డి శ్రీధర్‌బాబు, మాజీమంత్రి టి హరీశ్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ముకుందరెడ్డి, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య, హెచ్‌యూజే అధ్యక్షులు బి అరుణ్‌కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్, డీజేఎఫ్‌టీ అధ్యక్షులు జ్యోతిబసు, ప్రధాన కార్యదర్శి మస్తాన్ తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్ హఠాన్మరణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



