Sunday, September 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవచ్చే నెల 15న ఉపాధి హామీ కార్మికుల దేశవ్యాప్త సమ్మె

వచ్చే నెల 15న ఉపాధి హామీ కార్మికుల దేశవ్యాప్త సమ్మె

- Advertisement -

వ్యవసాయం, గ్రామీణ జీవనంపై కార్పొరేట్‌ దాడి
రైతు-కార్మికుల ఐక్య పోరాటమే ప్రత్యామ్నాయం : బి వెంకట్‌, ఎంపీ శివదాసన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ ప్రభుత్వం మోకరిల్లిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, ఎంపీ శివదాసన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కర్నాటకలోని షాపూర్‌లో వ్యవసాయ, గ్రామీణ కార్మికుల మహాప్రదర్శనలో వారు మాట్లాడారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నదని విమర్శించారు. వ్యవసాయ కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలపై వచ్చే నెల 15న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా అడుగులకు మడుగులొత్తేలా మార్చిన బీజేపీ ప్రభుత్వం, గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థను అదానీ, అంబానీ వంటి క్రోనీ క్యాపిటలిస్టుల పరం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వలసాధిపత్యానికి బానిసగా.. కార్పొరేట్లకు కాపలాగా మోడీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల పేరిట దేశ ఆహార భద్రతను విదేశీ శక్తుల చేతుల్లో పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ధనబలం, మీడియా మేనేజ్‌మెంట్‌, అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ దేశాన్ని నియంతత్వ కోరల్లోకి నెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వావలంబనతో వెలుగొందుతున్న భారతీయ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు బానిసగా మారుస్తున్నదని చెప్పారు. వ్యవసాయంలో యంత్రాల పెరుగు దల, కార్పొరేట్‌ కాంట్రాక్ట్‌ వ్యవసాయం వల్ల పనిదినాలు తగ్గిపోవడంతో పాటు ఉపాధి సంక్షోభం మరింత తీవ్రమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాల అమలు లేకపోవడం వల్ల దోపిడీతో పాటు వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం వల్ల గ్రామీణ పేదలు నిరుద్యోగం, ఆకలి బారిన పడుతున్నారని తెలిపారు. మే 15న ఉపాధి హామీ కార్మికుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పంచాయితీల ముట్టడులుంటాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -