యువమోర్చా డివిజన్‌ అధ్యక్షుడిగా దేవానంద్‌ ముదిరాజ్‌ నియామకం

నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రంగారెడ్డి డివిజన్‌ బీజేపీ యువమోర్చా అధ్యక్షులుగా దేవానంద్‌ ముదిరాజ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం శివాజీ చౌక్‌ చౌరస్తాలో గల ఆ పార్టీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్‌ నియామక పత్రాన్ని దేవానంద్‌ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ప్రధాన కార్యదర్శి మణికంఠ ,జిల్లా ఓబీసీ మోర్చా కార్యాలయ కార్యదర్శి మానే సంజీవ్‌ కుమార్‌, ఓబీసీ మోర్చా అధ్యక్షులు గోపాల్‌, నారాయణ గౌడ్‌ ,తదితరులు పాల్గొన్నారు

Spread the love