జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ- అచ్చంపేట
అథ్లెటిక్స్ పై ఆసక్తి పెంచుకుంటే చెడు వ్యసనాలకు చెక్ పెట్టొచ్చు అని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్ పోటీలను అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల మైదానంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి అడిషనల్ ఎస్పీ మాట్లాడారు గ్రామీణ ప్రాంత క్రీడాకారులు బాల్యం నుంచే క్రీడల పట్ల మక్కువ పెంచుకుని ఆటల్లో లీనమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగి, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. అంతేగాక సాధారణంగా క్రీడల్లో గెలుపోటములు ఉంటాయని గెలిస్తే పొంగిపోకుండా ఓడినా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో నిలకడగా రాణించాలన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
జిల్లా నలుమూలల నుంచి దాదాపు 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు తెలిపారు. వచ్చే నెల మే 10న హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో తెలంగాణ స్టేట్ త్రోస్ జంప్స్ అండ్ 400 మీ. అండర్ 16,18,20 సం.ల బాల బాలికలు సీనియర్స్ (మెన్ అండ్ ఉమెన్ ) పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా హైదరాబాదులోని కొల్లూరు నందుగల గౌడియం స్పోర్టోపియా స్కూల్ లో జరగబోయే తెలంగాణ 11వ రాష్ట్ర సబ్-జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్-2025 (అండర్-8, 10, 12, 14 సం,,ల బాయ్స్ & గర్ల్స్) పోటీలు జరుగనున్నాయి.
ఇక్కడ జరుగున్న పోటీలలో సెలెక్షన్ అయిన వారు ఆ పోటీలలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు, స్థానిక పాఠశాల/కళాశాల ప్రిన్సిపల్ బాలస్వామి, ఎస్సై సద్దాం, ఫిజికల్ డైరెక్టర్స్ బాలయ్య, మైబమ్మ, వాలీబాల్ కోచ్ శివ, పీఈటీ లు జ్యోతి, రాజేందర్, మల్లేష్, అంజయ్య, నిరంజన్, నిరంజనమ్మ, కృష్ణవేణి, పద్మజ, అంజనమ్మ, ఝాన్సీ రాణి, రాజు, రాణా మల్లేష్ క్రీడాభిమానులు ఉన్నారు.



