Sunday, July 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహనీయులు ఆశయాలకనుగుణంగా అభివృద్ధి

మహనీయులు ఆశయాలకనుగుణంగా అభివృద్ధి

- Advertisement -

దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-కల్చరల్

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి సామాజిక తరగతికీ అభివృద్ధి ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయిధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య ఆశయాలైన సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం వంటి విలువలను కాపాడటం మన అందరి బాధ్యత అన్నారు. సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రైతు సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. మహనీయుల ఆశయాలను భావితరాలకు చేరవేయడం, సమ సమాజ నిర్మాణానికి కృషి చేయడం ఎంతో అవసరమన్నారు. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఏ కుటుంబాలు అయితే ఉన్నత చదువులు చదివాయో ఆ కుటుంబాలే ఉన్నత స్థాయిలో ఉన్నట్టు ఇటీవల చేసిన కుల సర్వేలో గుర్తించామన్నారు. విద్య ఎంతో ముఖ్యమైందని, చదువుకున్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతామన్నారు. అనంతరం దొడ్డి కొమురయ్య అన్న కొడుకు దొడ్డి బిక్షపతి వైద్య చికిత్సల కోసం కురుమ సంఘం ట్రస్టు తరఫున రూ.50వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, గొర్రెల కార్పొరేషన్ చైర్మెన్‌ సరిత తిరుపతయ్య, కురుమ సంఘం రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాల మాయాదేవి, ఎండి మల్లయ్య బట్టు, దొడ్డి కొమురయ్య ఉత్సవ కమిటీ చైర్మెన్‌ డాక్టర్ జంగిటి కమలాకర్ కురుమ, వైస్ చైర్మెన్‌ డాక్టర్ కంకల ఎలేందర్ కురుమ, కమిటీ సభ్యులు చిందం వెంకటేష్ కురుమ, గొరిగె నరసింహ కురుమ, నారి మల్లేష్ కురుమ, దొడ్డి చంద్రం కురుమ, దొబ్బ భాస్కర్ కురుమ, యాద శంకర్ కురుమ, కోటి సునీత కురుమ, సాయి కురుమ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -