Sunday, July 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభారత వారసత్వ
 పరిరక్షణకు పాటుపడుదాం

భారత వారసత్వ
 పరిరక్షణకు పాటుపడుదాం

- Advertisement -

బీమా ఉద్యోగుల సంఘం పిలుపు
ఘనంగా ఏఐఐఈఏ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

భారత సమ్మిళిత వారసత్వ పరిరక్ష‍ణ కోసం పాడుపడుదామని
అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఏఐఐఈఏ) పిలుపునిచ్చింది. బీమా ఉద్యోగుల సేవలో 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను నిర్వహించింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)ను బలోపేతం చేయడం, ప్రభుత్వ రంగ బీమా పరిశ్రమను పరిరక్షించడం పట్ల కార్యదీక్ష‍ను తీసుకున్నట్టు పేర్కొంది. శనివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్సవాలను నిర్వహించింది. ఈసందర్భంగా ఏఐఐఈఏ అధ్యక్ష‍ులు ధర్మరాజ్ మహాపాత్ర పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐఐఈఏ మాజీ అధ్యక్షులు వి. రమేష్ అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా స్వాగతోపన్యాసం చేస్తూ…ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు ఎల్‌ఐసీ ప్రయోజనాలను కాపాడుతూ సంఘం సాగించిన చారిత్రక ప్రస్థానాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రముఖ చర్రితకారులు సోహైల్ హష్మీ మాట్లాడుతూ భారతదేశం వైవిధ్యభరితమైన, సమ్మిళిత సంస్కృతి గొప్పతనాన్ని ప్రసంగించారు. భారత నాగరికత బహిష్కరణతో కాక, సమ్మిళిత భావనతోనే వికసించిందని పేర్కొన్నారు. దేశ ఐక్యతను, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలంటే ఈ బహుళత్వ స్వభావాన్ని పరిరక్షించడం అత్యంత అవసరమని ఆయన నొక్కి చెప్పారు. అమానుల్లాఖాన్ రచించిన ‘ఏఐఐఈఏ స్ట్రగుల్స్‌’ గ్రంథాన్ని ఏఐఐఈఏ మాజీ ప్రధాన కార్యదర్శి కె. వేణుగోపాల్ ఆవిష్కరించారు. గత 75 ఏండ్లలో ఏఐఐఈఏ సాగించిన చారిత్రక పోరాటాలు, సాధించిన విజయాలను రచయిత వివరించారు. సీనియర్ నాయకత్వం నిర్మించిన గొప్ప వారసత్వాన్ని భావితరాలు కాపాడుతూ మరింత ముందుకు తీసుకెళ్లాలని యువతకు పిలుపునిచ్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 150 మంది ప్రతినిధులతో సహా 500 మందికి పైగా ప్రతినిధులు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -