
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలో16, 17 వ వార్డులో సోమవారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార భాగంలో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ ని చేతు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా ఉంటదని మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.అనేక ప్రాజెక్టులు కట్టిన ఘనత రైతాంగాన్ని ఆదుకున్న ఘనత కార్మిక కర్షకులను ఆదుకున్నఘనత కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కేంద్రంలో బిజెపి వస్తే నిత్యవసర వస్తువులు గాని ముడిసరుకులు గాని అత్యధికంగా జీఎస్టీ ద్వారా పన్ను వేసే పరిస్థితిలో ఉంటది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. 16,17 వార్డుకు సంబంధించిన నాయకులు వంగల శీను,దాడి మల్లేశం, తోట లహరి, అంబాటి చందు, తోటరాజు, అరుణ్ తేజ చారి, బొందల మహేష్, గిన్నెల రవి, కాంగ్రెస్ నాయకుల తోపాటు తదితరులు పాల్గొన్నారు.