కాంగ్రెస్‌తోనే పేదప్రజల అభివృద్ధి

నవతెలంగాణ-భువనగిరి
రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే జరుగుతుందని భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పంజాల రామాంజనేయులు గౌడ్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్‌ ప్రమోద్‌ కుమార్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బర్రె జహంగీర్‌లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి నియోజకవర్గంలో నేటి నుండి కాంగ్రెస్‌ 6 గ్యారంటీ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఎవరికి వచ్చిన అందరం కలిసికట్టుగా కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఈరపాక నరసింహ పడిగెల రేణుక ప్రదీప్‌ జిల్లా ఎన్‌ ఎస్‌ యు ఐ అధ్యక్షులు మంగ ప్రవీణ్‌ జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి నచ్చు నాగయ్య జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి చిన్నం శ్రీనివాస్‌ వలిగొండ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు యుగేందర్‌ రెడ్డి యువజన కాంగ్రెస్‌ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కొల్లూరి రాజు ఉడుత కార్తీక్‌ పట్టణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జిట్టా మల్లారెడ్డి ఓబిసి కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు కల్య నాగరాజు గ్యాస్‌ చిన్న పాల్గొన్నారు.

Spread the love