బీజేపీ ప్రభుత్వ బొగ్గు గనుల వేలంపాటను నిరసిస్తూ ధర్నా..

– ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు నశించాలి..
– కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వేలంపాటను నేరుగా నిర్వహించడం దారుణం..
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మంచిర్యాల జిల్లాలో శ్రావణపల్లిలో ఉన్న బొగ్గు గనులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలంపాటలో ప్రైవేటు రంగానికి అప్పజెప్పాలని చూస్తుందని దీనిని వెంటనే ఆపాలని కేంద్ర సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో వారు హాజరై,  మాట్లాడారు. తెలంగాణలో సింగరేణి కాలరీస్ బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ సహజంగానే శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గును తవ్వాలి కానీ వేలంపాట ద్వారా ప్రైవేట్ సంస్థలకు బొగ్గును తవ్వడానికి అవకాశం కల్పిస్తున్నది. మన రాష్ట్రం నుండి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా వేలంపాటను ప్రారంభించడం దారుణమని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ చేయబోమని బూటకపు మాటలు చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సంస్థలు ప్రైవేటుపరం చేస్తే ఏమి మిగులుతుందని ప్రశ్నించారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో దేశంలో ఉన్న ఆరు లక్షల కోట్ల విలువైన ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పాలని బీజేపీ చూస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే రూ.28,747 కోట్ల విలువైన గనులను ప్రయివేటు సంస్థలకు ఇవ్వాలని చూస్తుందని అన్నారు. ఇప్పటికే ఈ పదేళ్ల కాలంలో 200 పైగా గనులను ప్రయివేటు సంస్థలకు అప్పజెప్పారని అన్నారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుండి ఎనిమిది మంది శాసనసభ్యులు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న దీని మీద నోరు మెదపకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా వేలంపాట నిర్వహించడమంటే రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలపై దృష్టి లేదని ఆయన్ను విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వరంగ సంస్థలను కారుచవుకగా ప్రయివేటు పరం చేయాలని బీజేపీ చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, దోనూరి నర్సిరెడ్డి, కల్లూరు మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, బొల్లు యాదగిరి, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేష్, మాయ కృష్ణ, గంగాదేవి సైదులు, ఎండీ పాషా, బూరుగు కృష్ణారెడ్డి, గడ్డం వెంకటేష్, ఎం ఏ ఇక్బాల్, మనం ఉపేందర్,గుండు వెంకటనర్సు, గాడి శ్రీనివాస్, బర్రు అనిల్, వేముల భిక్షం, ర్యకల శ్రీశైలం, లావుడియ రాజు, ఈర్లపల్లి ముత్యాలు, చింతల శివ, బందేల ఎల్లయ్య, లలిత, రాగిరి కిష్టయ్య, కొండ అశోక్, హనుమంతు లు పాల్గొన్నారు.
Spread the love