కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం పెసర్స్ డే నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి అనంతరం జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రఘురాజు మాట్లాడుతూ విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకమని ప్రభుత్వ కళాశాలలో ఈ సంవత్సరము నుండి ఇంగ్లీషు ల్యాబ్ ప్రారంభించామని అన్ని అర్హతలు ఉన్న అధ్యాపకులు ద్వారా విద్యాబోధన నడుస్తుందన్నారు విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు వచ్చి చదువుకోవాలని, క్రమశిక్షణతో మెలగాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వర్ని కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు