Saturday, May 2, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్‌గా దిలీప్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్‌గా దిలీప్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట పురపాలక సంఘ మూడో కమిషనర్‌గా తూడి దిలీప్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీ అయిన కమిషనర్ బి. నాగరాజు నూతన కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందించి బాధ్యతలు అప్పగించారు. నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన టి. దిలీప్ రెడ్డి వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం సల్కెలాపురం గ్రామానికి చెందినవారు. 2024–25 సంవత్సరానికి నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో ఎంపికై, అశ్వారావుపేట గ్రేడ్–II కమిషనర్‌గా నియమితులయ్యారు.

ఇంతకుముందు 2019–20లో ఎస్‌ఐగా ఎంపికైన దిలీప్ రెడ్డి, శిక్షణ సమయంలోనే పోలీస్ శాఖకు రాజీనామా చేసి గ్రూప్–1 లక్ష్యంగా సిద్ధమయ్యారు. కృషి, పట్టుదలతో గ్రూప్–1లో విజయం సాధించి ప్రస్తుతం అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. యువ అధికారి దిలీప్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో పురపాలక పరిపాలనలో మరింత చురుకుదనం, పారదర్శకత నెలకొంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

మేజర్ పంచాయతీ అశ్వారావుపేట 2025 జనవరిలో మున్సిపాలిటీ గా ఏర్పాటు అయ్యాక పాల్వంచ కమీషనర్ సుజాత ఇంచార్జి కమీషనర్ గా వ్యవహరించారు.అనంతరం రెగ్యులర్ కమీషనర్ గా పదోన్నతి పై నాగరాజు విధులు నిర్వహించారు.ప్రస్తుతం దిలీప్ రెడ్డి మూడో కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -