ఆర్జీ-3& ఏపీఏ ఏరియాల్లో పర్యటించిన డైరెక్టర్ ఆపరేషన్స్, అడ్వైజర్ మైనింగ్

నవతెలంగాణ-రామగిరి : సింగరేణి ఆర్జీ-3&ఏపిఏ ఏరియాలో డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్వికె శ్రీనివాస్, అడ్వైజర్ మైనింగ్ డిఎన్ ప్రసాద్ లు శుక్రవారం ఎఎల్ పి గని, ఓసిపి-2 ఉపరితల గనిని సందర్శించి నడుస్తున్న పనులను పరిశీలించారు.అనంతరం జిఎం కార్యాలయంలో డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్ వికె శ్రీనివాస్ ఆర్జీ-3 జిఎం ఎన్ సుధాకర్ రావు, ఏపీఏ జిఎం కె .వెంకటేశ్వర్లుతో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల కారణంగా ఉత్పత్తి, రవాణాలకు ఆటంకం కలగకుండా చూడాలని, నా రక్షణ, నా బాధ్యత అని ఎవరు కూడా మరువరాదని, వర్షాకాలంలో ఉపరితల గనులలో నిలిచే నీటిని పంపుల ద్వారా ఎప్పటికప్పుడు బయటికి పంపించే ఏర్పాటు చేయాలని, అందుకు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ సీతారామం, ఎస్ఓ-టు జిఎం డి బైద్య, ఏరియా సర్వే అధికారి జైనుల్లా బద్దీన్, ప్రాజెక్ట్ అధికారులు ఎన్ రాధాకృష్ణ, కె నాగేశ్వరరావు, కె రాజేందర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love