గోవింద్ పెట్ సొసైటీ యందు రుణాలు పంపిణీ

నవతెలంగాణ-ఆర్మూర్ : మండలంలోని గోవింద్ పెట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో రుణమాఫీ పొందిన రైతులలో 50మంది రైతులకు తిరిగి కొత్త రుణాలను మంజూరు చేయడం జరిగింది అని సొసైటీ చైర్మన్  బంటు మహిపాల్ శుక్రవారం తెలిపారు. కొత్తగా చేరిన 13 మంది రైతులకు కూడా రుణాలు మంజూరు చేయడం జరిగింది. మొత్తం 63 మంది రైతులకు మొత్తం రూ” 4817500/- చెక్కులను పంపిణీ చేశారు. ఇట్టి రుణాలను రైతులు వ్యవసాయ పంటలపై పెట్టి అభివృద్ధి కావాలని కోరారు తద్వారా సొసైటీ కి లాభం చేకూరుతుందన్నారు. రుణాలు తీసుకున్న రైతులు ప్రతి   సంవత్సరానికి ఒకసారి వడ్డీని చెల్లించి సొసైటీ కి తోడ్పడాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు ఉపాధ్యక్షులు తూర్పు రాజన్న సొసైటీ డైరెక్టర్లు కాశిరెడ్డి శ్రావణ్ , దార్ల గంగారం, గోపాసి గంగు , నల్లూరి రమేష్, ఎర్రం వంశీ, లక్కారం సాగర్, కొండ గంగాధర్, లక్కారం నర్సింలు (తవ్వన్న)  తో పాటు, సొసైటీ సీఈఓ.రమేష్ , సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Spread the love