నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలంలోని 15వ విడత గ్రామసభలకు, ఆయా గ్రామాలలో గ్రామ సభలను ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించడం జరిగిందని డిఆర్పి సంతోష్ పేర్కొన్నారు. ఆదివారం రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో సర్పంచ్ పాముల సాయిలు అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. గత సంవత్సర కాలంలో ఉపాధి హామీ పనుల పై చర్చించారు. మండలంలోని కందకుర్తి, వీరన్న గుట్ట గ్రామాలలో సైతం గ్రామసభలను నిర్వహించారు. గ్రామంలో జరిగిన పనులపై చర్చించి లోటుపాట్లను సరి చేయడం జరిగిందని డిఆర్పి పేర్కొన్నారు. ఉపాధి హామీ డబ్బులు రావడం లేదని కూలీలు ఆయన దృష్టికి తీసుకురా పోస్ట్ ఆఫీస్ లలో తమ ఖాతాలో డబ్బులు పడ్డాయని స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే తమ డబ్బులు తెలుస్తాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రమణ, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, క్షేత్ర సహాయకులు గోపి, తనిఖీ బృందం నగేష్ తదితరులు పాల్గొన్నారు.