అస్తవ్యస్తంగా వలిగొండ గ్రామసభ

– స్థానిక సమస్యల పట్ల నిర్లక్ష్యం
నవతెలంగాణ- వలిగొండ
మేజర్‌ గ్రామపంచాయతీలో రెండు నెలలకు ఒకసారి నిర్వహించే గ్రామసభ అస్తవ్యస్తంగా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని గ్రామ సభలో నిలదీశారు. శనివారం స్థానిక సర్పంచ్‌ బోళ్ల లలిత అధ్యక్షతన గ్రామసభ 12 గంటలకు జరిగింది గ్రామసభ ఆలస్యంగా నిర్వహించడంతో పట్టుమని పదిమంది కూడా హాజరు కాలేదు ఈనెల 29 తేదీ నుండి జూన్‌ రెండవ తేదీ వరకు బొడ్రాయి ప్రతిష్ఠాపన శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని కల్యాణ మహోత్సవం పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ప్రజలు ఆ తేదీలలో పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నది దానికి సంబంధించి పారిశుద్ధ్యం మంచినీటి సమస్య వీధిలైట్లు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు ఓపెన్‌ డ్రైనేజీలు ఆరోగ్య సిబ్బంది కష్ణ వాటర్‌ సిబ్బంది ఎలక్ట్రిషన్‌ తదితర శాఖల స్థానిక సిబ్బంది గ్రామసభకు పిలిచి వారి సహకారం కోరలేదని నిలదీశారు. కేవలం ఫోన్‌ ద్వారా సమాచారం అందించమని నిర్లక్ష్యంగా తెలుపుతున్నారన్నారు. ఒకటో వార్డు రెండవ వార్డు ఐదో వార్డు 12వ వార్డు 13వ వార్డు లో నీటి సమస్య నాలుగో వార్డ్‌ ఆరవ వార్డు 12 వార్డు వార్డుల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు ధ్వంసం అయినా ఇప్పటివరకు పట్టించుకోవడంలేదని అడిగారు. పట్టణం కేంద్రంలో వీధిలైట్లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. స్థానికంగా వెంచర్లలో 10 శాతం భూమి గ్రామపంచాయతీ ఆధీనంలోకి తీసుకోవడంలో మీనా మేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించినట్టు తెలిపారు ఇంటి అనుమతులు పేరా ప్రభుత్వం తిరిగి గ్రామపంచాయతీలో జమ చేసిన గత సంవత్సరం 10 లక్షలు వాటి జవాబు చెప్పడం లేదన్నారు. ప్రస్తుత సంవత్సరానికి ఎంత జమైందో స్పష్టత ఇవ్వకుండా దాటే చేశారు అన్నారు మడి గల లో రూ లక్షలాది రూపాయలు పెండింగ్‌ లో ఉన్న పాలకవర్గం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తూ గ్రామపంచాయతీ ఆదాయాన్ని నష్టపరిచిన అధికారులు పట్టించుకోవడంలేదని నిలదీశారు. మడిగెల వేలం పాటలలో డీడీలు కట్టకుండా వేలంపాట దక్కించుకోకున్న అక్రమంగా ఉన్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సర్పంచ్‌ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రామసభలో ఉప సర్పంచ్‌ మై సోలా మచ్చ గిరి ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు .

Spread the love