నవతెలంగాణ- రామారెడ్డి : మండలంలోని అన్నారం గ్రామంలో శుక్రవారం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. తెలంగాణ సాంస్కృతికి సాంప్రదాయాలకు బతుకమ్మ పండగ నిదర్శనమని, తీరొక్క పువ్వులు సమకూర్చి ఆడపడుచులు నిర్వహించే పండగే బతుకమ్మ పండుగ అని అన్నారు. పండుగను గౌరవించి ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.