రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చిరువ్యాపారులకు తోపుడుబండ్ల వితరణ..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల రెవెన్యూ కార్యాలయం ప్రాంతంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారుల స్వయం ఉపాధి సహాయార్థం తోపుడుబండ్ల వితరణ కార్యక్రమం శుక్రవారం ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు సతీష్ షాహ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోటరీ అంతర్జాతీయ సంస్థ ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తగిన సహకారాలను వృత్తిరీత్యా, ఒకేషనల్ కోర్సుల రీత్యా అందిస్తుందని అన్నారు. దినిలో భాగంగానే చిరు వ్యాపారుల స్వయం ఉపాధి సహాయార్థం రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ మొయినాబాద్ సహకారంతో క్లబ్ సభ్యుల సహకారంతో తోపుడుబండ్ల వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ ఎం. శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ.. పేదలకు అందుబాటులో సౌకర్యాలు లేక తగు సంఖ్యలో జీవనోపాధి పొందలేకపోతున్నారని వారికి చేయూతగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారు స్వయం ఉపాధి సహాయార్థం ఈ తోపుడు బండ్ల వితరణ చేయడం ఒక సఫలీకృత మైనటువంటి ఆలోచన నని అన్నారు. తదనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ.. డిచ్ పల్లి మండలంలో రోటరీ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను వైద్య, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణం వంటి అంశాలలో కార్యక్రమాలు నిర్వహించి డిచ్ పల్లి మండలంలోని లింగసముద్రం గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్న మని వివరించారు. తోపుడుబండ్ల వితరణ చిరు వ్యాపారుల సహాయార్థం ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో కార్య నిర్వహణ అధికారి శ్యామ్ అగర్వాల్,వి శ్రీనివాసరావు, బాబు రావ్, మానవతా సదన్ కేర్ టేకర్ అందే రమేష్, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love