క్షత్రియ సేవాసమితి  ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ…

– మానవ సేవే మాధవ సేవ – క్షత్రియ సంఘం నాయకులు సోమరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట : భద్రాద్రి శ్రీ  సీతారామచంద్ర స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా బుధవారం క్షత్రియ సేవాసమితి  అశ్వారావుపేట ఆధ్వర్యంలో  స్థానిక బస్ స్టాండ్ ప్రయాణీకుల ప్రాంగణంలో రెండు వేలు మంది ప్రయాణీకులకు మంచినీరు,మజ్జిగ,పానకం, పులిహోర ప్యాకెట్ లను ఉచితంగా పంపిణీ చేసారు. ఈ సందర్భంగా క్షత్రియ సేవా సమితి బాధ్యులు సోమరాజు  కార్యక్రమాన్ని  ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణ రక్షణే కాక,శ్రీరామ నవమి కి హాజరైన భక్త ప్రయాణీకులకు, యాత్రికులకు చక్కగా చల్లని మజ్జిగ అందించడం కూడా రాముల వారికి సేవ చేసినట్లే నని,దీనినే మానవ సేవే మాధవసేవ అన్నారు.  ఈ మండు వేసవిలో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన యాత్రికులకు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం ద్వారా దాహార్తిని తీర్చడం చాలా మంచి కార్యక్రమాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బస్ స్టాండ్ కంట్రోలర్ నార్లపాటి సునీత,  క్షత్రియ సేవా సమితి బాధ్యులు పెన్మత్స సత్యనారాయణ రాజు(బాబు)ప్రసాద రాజు,గొట్టిముక్కల చంటి రాజు,మురళీ రాజు,భూపతి రాజు కృష్ణం రాజు,విజయలక్ష్మి లు పాల్గొన్నారు.
Spread the love