సబ్సిడీపై జిలుగు జనుము విత్తనాల పంపిణీ

– మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలలో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లలో సబ్సిడీపై రైతులకు  జీలుగు జనుము విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందాలంటే ముందుగాల రైతులు పచ్చి రొట్ట  విత్తనాలను వాడాలని అన్నారు భూసార పరిరక్షణ కోసం పచ్చి రొట్ట పైరు సాగు చేసి భూమిలో కలియ దున్నినట్లయితే భూసారం పెరుగుతుంది. తద్వారా అధిక దిగుబడి పొంది రైతు ఆర్థికంగా లాభం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాలలో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రాలలో  ఈ విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీనిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిలుగు ఒక బస్తా 30 కేజీలది సబ్సిడీపై రూ.1116 రూపాయలకే లభించునని అన్నారు. జనుములు ఒక బస్తా 40 కేజీలది సబ్సిడీపై రూ.1448 రూపాయలను చెల్లించి తీసుకోవాలని అన్నారు. వీటిని పొందాలంటే రైతులు పట్టా పాస్ బుక్కు, ఆధార్ జిరాక్స్ లు తీసుకొని కేంద్రాల్లోకి వెళ్ళితే మీకు దొరుకుతాయని అన్నారు. దీనినే ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. పంటలపై చీడపురుగులు విషయంలో ఏ సమస్య వచ్చినా సంబంధిత వ్యవసాయ అధికారిని లేదా ఏఈఓ  సంప్రదించి సలహాలు తీసుకోవాలని అన్నారు. రైతులు ఏ రకమైన విత్తనాలనుకున్న రసీదు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు నిర్వాహకులు ఉన్నారు.
Spread the love