- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమము, 2026-27 విద్య సంవత్సరానికి గాను ఉచిత పాఠ్యపుస్తకాలను గ్రామ సర్పంచ్ బండి స్వామి చేతులమీదుగా అందించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీత తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్, ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉచిత నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.
- Advertisement -



