పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 179 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 175 మంది విద్యార్థులు హాజరై, నలుగురు విద్యార్థులు గైహాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో, నిర్వహించాలని పరీక్షా కేంద్ర అధికారులకు సూచించారు. ఆయన వెంట రెవిన్యూ అధికారులు లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ మధు శ్రీ వాత్సవ ఉన్నారు.
Spread the love