నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జిగా నియమింపబడిన తర్వాత ఈ రోజు మొదటిసారి నిజామాబాద్ కు వచ్చిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంగళవారం స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో మాజీమంత్రి,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,మాజీ మంత్రి మొహమ్మద్ అలీ షబ్బీర్ ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి , పిసిసి ఉపాధ్యక్షులు తహెర్ బిన్ హం దన్ ,పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి,రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి,బాల్కొండ ఇంఛార్జి సునీల్ రెడ్డి, బాన్స్వాడ ఇంఛార్జి రవీందర్ రెడ్డి,జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్,జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు,జిల్లా కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు.