ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య

నవతెలంగాణ – గోవిందరావుపేట
జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య మంగళవారం మండల కేంద్రంలోని గోవిందరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అప్పయ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలను అందించి ముందుండాలని పలు సలహాలు సూచనలు చేయడం జరిగింది.తదనంతరం గోవిందరావుపేట పీహెచ్సీ పరిధిలోని రంగాపురం లోగల  ఉప ఆరోగ్య కేంద్రాన్ని( సబ్ సెంటర్ ) కూడా తనిఖీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్ , డాక్టర్ సునీత,హెల్త్ అసిస్టెంట్ జంపయ్య వైద్య సిబ్బంది ఆశాలు పాల్గొన్నారు.
Spread the love