గిరిజన విద్యార్థిని వైద్యానికి.. జిల్లా వైద్యాధికారి ఆర్థిక సాయం

నవతెలంగాణ- తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల ఏజెన్సీ గ్రామానికి చెందిన ఆగబోయిన సంధ్య అనే ఆదివాసి విద్యార్థిని వింత వ్యాధితో బాధపడుతుంది అనే నవతెలంగాణ పత్రిక శీర్షిక ప్రచురితం కావడంతో ములుగు జిల్లా వైద్యాధికారి అల్లం అప్పయ్య  ప్రత్యేక శ్రద్ధతో ఆదివాసి విద్యార్థినికి వైద్యం అందిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో వైద్యం పొందుతున్న, గిరిజన విద్యార్థిని ఆగబోయిన సంధ్య ను ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సహాయంతో పరిశీలించారు. విద్యార్థినికి నార్మల్ రిపోర్ట్లు వచ్చాయని, కండరాల పరీక్ష నిర్వహించుకోవడానికి వారి వద్ద డబ్బులు లేకపోవడంతో,  జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, తన సొంత ఖర్చులతో ఆర్థిక సహాయం అందించారు. పాప ఆరోగ్యం కొంత కుదుటపడిందని, ఇంకా సమయం పడుతుందని అన్నారు. ఆదివాసి విద్యార్థిని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన జిల్లా వైద్యాధికారికి వివిధ ఆదివాసి సంఘాలు నాయకులు అల్లం అప్పయ్య కు ధన్యవాదాలు తెలిపారు.
Spread the love