జాతీయ జూనియర్ బేస్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఈనెల 10 న కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర జట్టు ఎంపిక లో జిల్లా క్రీడాకారులు దీప, కీర్తన (సాంఘిక సంక్షేమ కళాశాల ధర్మారం), దేవిశ్రీ, సింధూల (సాంఘిక సంక్షేమ కళాశాల సుద్దపల్లి), వైష్ణవి నిహారిక సాంఘిక సంక్షేమ కళాశాల ఆర్మూర్) లు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి ఈనెల 22 నుండి 25 వరకు పంజాబ్ లోని  సంగూర్ లో జరగనున్న 31 వ జాతీయ జూనియర్ బేస్బాల్ ఛాంపియన్ పోటీలకు ఎంపికైనట్లు జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ కుమార్ లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను బుధవారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ధర్మారంలో అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ విద్య సంస్థ లా ప్రాంతీయ అధికారిని అలివేలు, జిల్లా అధికారిని సంగీత, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజ రెడ్డి, జిల్లా బేస్ బాల్ సంఘం కోశాధికారి బొజ్జ మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షులు మర్కంటి గంగా మోహన్, సంఘ సభ్యులు తేజావత్ గంగాధర్, సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ నరేష్ పి ఈ టి జోష్ణ పాల్గొన్నారు.
Spread the love