ఆదిత్య ఎల్-1.. విజయవంతంగా కక్ష్య పెంపు

నవతెలంగాణ -బెంగూళూర్: సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 లక్ష్యం దిశగా పయనమైంది. ఇప్పటికే దాని కక్ష్యను నాలుగుసార్లు పెంచిన శాస్త్రవేత్తలు తాజాగా ఐదోసారి పెంచి సూర్యుడి ట్రాన్స్ లగ్రేంజియన్ పాయింట్-1 దిశగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో తెలిపింది. ఇప్పటి నుంచి ఉపగ్రహం 110 రోజులు ప్రయాణించి 15 లక్షల కిలోమీటర్లు దూరంలోని ఎన్-1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు మరోమారు విన్యాసం చేపట్టి ఎల్-1 కక్ష్యలో ప్రవేశపెడతారు. సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కొరోనా వంటివాటి పరిశోధనకు సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్-1 మిషన్‌ను చేపట్టింది.

Spread the love