జకోవిచ్‌ దూరం

జకోవిచ్‌ దూరం– మియామీ ఓపెన్‌ 2024
మియామీ : వరల్డ్‌ నం.1, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ మియామీ ఓపెన్‌కు దూరమయ్యాడు. మియామీ ఓపెన్‌ ప్రధాన టోర్నీ ఈ నెల 19 నుంచి ఆరంభం కానుండగా.. టైటిల్‌ పోరు 30న జరుగుతుంది. టోర్నీ ఆరంభం ముంగిట జకోవిచ్‌ ఈ నిర్ణయం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘ఈ వయసులో (36) వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ షెడ్యూల్‌ను సమన్వయం చేసుకుంటున్నాను. మియామీ ఓపెన్‌లో పోటీపడలేక పోతున్నందుకు అభిమానులను క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్‌లో మళ్లీ ఇక్కడ ఆడటం కోసం ఎదురుచూస్తాను’ అని జకోవిచ్‌ తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశాడు. ఈ వారంలో ఇండియన్‌వెల్స్‌ ఓపెన్‌లో ఇటలీ కుర్రాడు లూకా నార్డి చేతిలో అనూహ్య పరాజయం చవిచూసిన జకోవిచ్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ జానిక్‌ సిన్నర్‌ చేతిలో కంగుతిన్నాడు. యూరోపియన్‌ సీజన్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం జకోవిచ్‌ త్వరలో మట్టికోర్టుపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తుంది.

Spread the love