ఇండియా కూటమికి గుడ్‌బై
లోక్‌సభ స్పీకర్‌కు కనిమొళి లేఖ
కుదిరిన టీవీకే-కాంగ్రెస్ పొత్తు
కాంగ్రెస్‌తో డీఎంకే కటీఫ్
ఈ మేరకు లోక్‌సభలో తమ సీట్లను మార్చాలని స్పీకర్ ఓం బిర్లాకు వినతి
చెన్నై : తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై చెప్పింది. లోక్‌సభలో తాము కూర్చునే సీట్లను మార్చాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను డీఎంకే ఎంపీ కనిమొళి కోరారు. డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా తమ ఎంపీలు లోక్‌సభలో తమ బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వర్తించడానికి వీలవుతుందని తెలిపారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌తో డీఎంకే పార్టీ పొత్తు ముగిసిపోయిం దని వెల్లడించారు. ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీలు ఇకపై కాంగ్రెస్ ఎంపీల పక్కనే కూర్చోవడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. తన అభ్యర్థనను స్పీకర్ కార్యాలయం తగిన విధంగా పరిశీలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కనిమొళి లేఖ రాశారు. కాగా, విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ మద్దతు తెలిపిన విషయం విదితమే. దీంతో హస్తం పార్టీ, డీఎంకే సుదీర్ఘ పొత్తు బంధం ముగిసినట్టయ్యింది.కుదిరిన టీవీకే- కాంగ్రెస్ పొత్తుదశాబ్దాలుగా రాష్ర్టాన్ని రాజకీయంగా శాసిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల గుత్తాధిపత్యాన్ని తెరదించుతూ, తన తొలి ఎన్నికల్లోనే విజయ్ నేతృత్వంలోని టీవీకే అదరగొట్టింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 10 సీట్ల దూరంలోనే నిలిచింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు బలం సరిపోకపోవడంతో కాంగ్రెస్ మద్దతును విజయ్ కోరారు. వెంటనే కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. టీవీకే పొత్తు విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్‌కు ఇచ్చింది. దీంతో టీవీకే- కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది.దశాబ్దాల బంధానికి కటీఫ్ఐదుగురు హస్తం పార్టీ ఎమ్మెల్యేలు విజయ్‌కి మద్దతు ప్రకటిస్తూ లేఖలు సమర్పించారు. కాంగ్రెస్ ఇన్నాళ్లు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకేను కాదని విజయ్‌కి మద్దతు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. అంతేకాదు ఈ మద్దతు కేవలం ప్రభుత్వ ఏర్పాటుకే పరిమితం కాదనీ, భవిష్యత్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఈ పొత్తు కొనసాగుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.‘డీఎంకేకి కాంగ్రెస్ ద్రోహం చేసింది’ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు హస్తం పార్టీ ద్రోహం చేసిందని విరుచుకుపడింది. తమతో బంధానికి గుడ్‌బై చెప్పిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. డీంకే కూటమి వల్లే కాంగ్రెస్‌కు రాజ్యసభ ఎంపీ, అసెంబ్లీ సీట్లు వచ్చాయని గుర్తు చేసింది. కాంగ్రెస్ తన పాత రాజకీయ స్వభావాన్ని మార్చుకోలేదని ఆక్షేపించింది. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమ సంఘీభావ సందేశం పంపింనందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్‌కు డీఎంకే ఎంపీ కనిమొళి శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడుకు గవర్నర్ అవసరం లేదు : కనిమొళిటీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లీకర్ ఇబ్బందులు పెడుతున్నారని వచ్చిన ఆరోపణలపై అంతకముందు డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. గవర్నర్ పదవిని తమ పార్టీ దీర్ఘకాలంగా వ్యతిరేకిస్తోందని పునరుద్ఘాటించారు. ప్రస్తుత పరిస్థితి రాజ్యాంగ ప్రక్రియలపై చాలా ప్రశ్నలను లేవనెత్తిందన్నారు. తమిళనాడుకు అసలు గవర్నర్ అవసరమే లేదని చెప్పారు. గవర్నర్ విషయంలో డీఎంకే వైఖరి ఎన్నడూ మారలేదని స్పష్టం చేశారు. ఏఐఏడీఎంకేకు డీఎంకే బయటి నుంచి మద్దతు ఇస్తుందన్న ఊహాగానాలను కూడా ఆమె తోసిపుచ్చారు. అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. ఏఐఏడీఎంకేకు తామేమీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.



