Saturday, May 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాళ్లుమొక్కుతా సారు

కాళ్లుమొక్కుతా సారు

- Advertisement -

జాయింట్ కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతు

నవతెలంగాణ-లక్షెట్టిపేట
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం శుక్రవారం రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నచ్చజెప్పినా రైతులు వినిపించుకోలేదు. చివరకు విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ చంద్రయ్య అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ రైతు ఆయన కాళ్ల మీదపడి.. త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకున్నాడు. అకాల వర్షాల వల్ల ధాన్యం మొత్తం తడిసి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఫలితం చేతికందకుండా పోతోందన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కు విన్నవించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రశీదు ఇవ్వాలన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని కోరారు. గాలివాన కారణంగా పంటను కాపాడుకునే క్రమంలో ఇటీవల నలుగురు ప్రాణం పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ చంద్రయ్య.. వెంటనే ధాన్యం కాంటాలు వేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరవించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -