చపాతీలు ఇలా చేస్తున్నారా?

చపాతీలు ఇలా చేస్తున్నారా?మన దేశంలో చాలా మందికి చపాతీలు ఆహారంలో ఒక భాగం. కొందరు డైట్‌ పాటించే క్రమంలో రాత్రి పూట చపాతిలు తింటుంటారు. అయితే ఇవి చేసే క్రమంలో వారి వారి ఆరోగ్యాల రీత్యా కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంటారు. అందులో కొందరు ఆయిల్‌ లేకుండా చపాతిని పెనం మీద కాలిస్తే కొందరు నేరుగా స్టవ్‌మీద కాలుస్తుంటారు. ఎందుకంటే ఆయిల్‌ లేకుండా పెనం మీద చేసిన చపాతి కొంచెం గట్గిగా ఉంటుంది. అలా కాకుండా నేరుగా స్టవ్‌ మీద కాలిస్తే మెత్తగా ఉంటుంది. అందువల్ల ఈ పద్ధతిని ఉపయోగించేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఇది ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యం సంగతి ఏమో కానీ అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయట. అవేంటో తెలుసుకుందాం.
ఒకప్పుడు చపాతీలు, పుల్కాలు నార్త్‌ ఇండియాలో ఎక్కువగా తింటారు. అయితే సౌత్‌ ఇండియాలోనూ వీటిని తినడం ఎక్కువైంది. ఆరోగ్యం ప్రకారం చపాతీలు కూడా మంచివే. చపాతీలు తింటే స్కిన్‌ హైడ్రేషన్‌ కాకుండా ఉంటాం. గోధుమ పిండితో చేసే చపాతీలు ఆరోగ్యానికి మంచి చేస్తాయి. చపాతీలు బరువు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కానీ చపాతీలు తయారుచేసేప్పుడు మాత్రం తప్పులు చేయకూడదు.
ఓ అధ్యయనం ప్రకారం… గ్యాస్‌ స్టవ్‌లు ఆరోగ్యానికి హాని కలిగించే వాయు కాలుష్యాలను విడుదల చేస్తాయని వెల్లడైంది. ఈ కాలుష్య కారకాలు, కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌, శ్వాస, జీర్ణక్రియకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అంతేకాదు క్యాన్సర్‌కు కూడా కారణమయ్యే అవకాశం ఉందని ఆ అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇష్టం వచ్చినట్టుగా చపాతీలు తింటే అనారోగ్యం వస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం.. కాల్చినా లేదా మాడిన ఆహార పదార్థాలు క్యాన్సర్‌ ప్రమాదాన్ని ఎక్కువగా పెంచుతాయి. అందుకే పుల్కాలు, చపాతీలు గ్యాస్‌ మీద నేరుగా కాల్చకూడదు. గతంలో వీటిని కట్టెల పొయ్యి మీద చక్కగా కాల్చేవారు. కానీ ఇప్పుడు దాదాపు అందరూ గ్యాస్‌ మీద నేరుగా కాలుస్తున్నారు. ఇది సురక్షితం కాదని నిపుణులు సూచిస్తున్నారు.
అందుకే చపాతీలు చేసేపుడు జాగ్రత్త వహించడం ఉత్తమం. ఆరోగ్యం కోసం తింటున్నామనుకుని అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది.

Spread the love