అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం జరుపుకున్న జిజిహెచ్ వైద్యులు

నవతెలంగాణ – కంటేశ్వర్ 
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాదులో డ𝑔యాలసిస్ సెంటర్లో అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవంను ఆస్పత్రి సిబ్బంది కేక్ కట్ చేసి వేడుకగా జరుపుకున్నారు.తరువాత ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మార్చి నెల 2 వ గురువారం కిడ్నీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని,  ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల ప్రాముఖ్యతను అలాగే మూత్రపిండ సంబంధిత ఆరోగ్య సమస్యలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ కిడ్నీ దినోత్సవాన్ని 2006లో ప్రారంభించారని తెలిపారు.ఈ సందర్బంగా రోగులందరు,  సౌకార్యాలు బాగునాయని సూపరింటెండెంట్ కి వైద్యులు కి ఇతర సిబ్బందికి అభినందనలు తేలిపారు.ఈ కార్యక్రమంలో  డా. హరికృష్ణ రెడ్డి, డా. మను  ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love